చిత్తూరులో స‌మంత రుత్ ప్ర‌భుకు సీమంతం

చిత్తూరు జిల్లా : పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందిన స‌మంత రుత్ ప్ర‌భు సంచ‌ల‌నంగా మారారు. త‌ను ఇప్పుడు గ‌ర్భ‌వ‌తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, ‘మా ఇంటి బంగారం’ సినిమాతో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో, సమంత సీమంతానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆమె తన భర్తతో కలిసి థాయిలాండ్ పర్యటనకు వెళ్లారు, ఆ తర్వాత చిత్తూరులోని తన అత్తగారింటికి వచ్చారు.

అక్కడ ఆమెకు ఒక సాధారణ సీమంతం వేడుక జరిగింది. రాజ్ సోదరి శీతల్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ ఫోటోలను పోస్ట్ చేయడంతో అవి హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స‌మంత రుత్ ప్ర‌భు న‌టించిన మా ఇంటి బంగారం బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. త‌న సినీ కెరీర్ లో ఈ మూవీ అత్యంత ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్పింది ఈ సంద‌ర్బంగా న‌టి స‌మంత రుత్ ప్ర‌భు. అయితే స‌మంత స్వంత ఊరు త‌మిళ‌నాడులోని చెన్నై. త‌న అత్త‌గారి ఇల్లు చిత్తూరు జిల్లా కావ‌డం. త‌న భ‌ర్త ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు. ప‌లు వెబ్ సీరీస్ తీశాడు. ఇందులో న‌టి స‌మంత కూడా న‌టించింది. స‌మంత‌కు ఇది రెండో పెళ్లి. అంత‌కు ముందు త‌ను అక్కినేని నాగ చైత‌న్య‌నను పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత విడి పోయింది.

  • Related Posts

    యూట్యూబ్‌లో షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలు’ పాట

    హైద‌రాబాద్ : తెలంగాణ‌లోనే కాదు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది జాన‌ప‌ద గీతం బాసింగ బ‌లాలు సాంగ్. ఒక మంచి జానపద గీతం కాలాతీతమైనది. అది గ్రామీణ జీవితం, సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం యొక్క సారాన్ని సంగ్రహించినప్పుడు, అది అన్ని తరాల ప్రేక్షకులతో…

    క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ స‌రికొత్త రికార్డు

    హైద‌రాబాద్ : క్రిస్టోఫర్ నోలన్ న‌టించిన‌ రాబోయే చారిత్రక చిత్రం ‘ది ఒడిస్సీ’ విడుదలకు ముందే సినీ ప్రేమికులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లలో అసాధారణ స్పందనను చూసింది, భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీమియం ఐమాక్స్ టిక్కెట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *