శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో హోమం

VijayaBhaskar · October 24, 2025
Spread the love

శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉద‌యం శ్రీ సుబ్రమణ్య స్వామి వారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ రోజు నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు సుబ్రమణ్యస్వామి వారి హోమం జరుగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, సహస్ర నామార్చన, విశేష దీపారాధన నిర్వ‌హించ‌నున్నారు.

కాగా ఈ నెల 27వ తేదీ శ్రీ దక్షిణ మూర్తి స్వామి వారి హోమం జరుగనుంది. అనంతరం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం జరుగనుంది.ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.