వైరా రాజ‌కీయ జీవితానికి పునాది

VijayaBhaskar · November 23, 2025
Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన భ‌ట్టి విక్ర‌మార్క‌

ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌త్యేకంగా త‌న రాజ‌కీయ జీవితం గురించి ప్ర‌స్తావించారు. త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు వైరా కీల‌కంగా మారింద‌న్నారు. వైరా అభివృద్ధికి ఒకేరోజులో రూ.400 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వైరా అంటేనే మ‌ల్లు కుటుంబ‌మ‌ని, ఇది త‌న‌కే కాదు త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు అది దోహ‌దంగా మారింద‌న్నారు. ఈ ప్రాంతంతో త‌న‌కు విడ‌దీయ‌లేని అనుబంధం ఉంద‌న్నారు. వైరా ప్రాజెక్ట్ లెఫ్ట్–రైట్ కెనాల్ లైనింగ్ పనులను రూ. 42 కోట్లతో మళ్లీ పనులు ప్రారంభిస్తున్నాం అన్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

గిరిజన రైతులకు 5,000 బోర్లు, కరెంటు, సోలార్ యూనిట్లను అందిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం. వైరాలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం రెండు స్లాబులు పూర్తి అయ్యాయని చెప్పారు. ప్రజల అభివృద్ధే మా ధ్యేయం అని స్ప‌ష్టం చేశారు. వైరా అభివృద్ధికి ఇదే ఆరంభం అని, ఇంకా ఎన్నో మంచి పనులు ముందున్నాయని అన్నారు. గాడి త‌ప్పిన అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌స్తుతం గాడిలో పెడుతున్నామ‌ని చెప్పారు. త‌మ స‌ర్కార్ విద్య‌, వైద్యం, ఉపాధి రంగాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నామ‌ని అన్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.