గోవా యూనివ‌ర్శిటీలో కాంగ్రెస్ గోవా ఫార్వ‌ర్డ్ విక్ట‌రీ

VijayaBhaskar · December 24, 2025
Spread the love

రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కంగ్రాట్స్

గోవా : గోవా రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల నుంచి ఎదుర‌వుతోంది. మొన్న‌టికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. త‌మ పార్టీకి చెందిన అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు. మ‌రో వైపు తాజాగా 15 సంవత్సరాల తర్వాత గోవా యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్ (GUSC) 2025–26 కు సంబంధించి ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌లు నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగాయి. కానీ చివ‌ర‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది బీజేపీ మ‌ద్ద‌తు సంస్థ అయిన ఏబీవీపీకి. ఈ ఎన్నిక‌లలో ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ – గోవా ఫార్వర్డ్ కూటమి ఘన విజయం సాధించింది.

సాయి దేశాయ్‌ను చైర్మన్‌గా, సోహమ్ రౌత్‌ను కార్యదర్శిగా, శృతి పవార్‌ను లేడీ మెంబర్‌గా ఎన్నుకున్నారు.
అన్ని కార్యనిర్వాహక సభ్యుల స్థానాలను కైవసం చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. ఈ సంద‌ర్బంగా యూనివ‌ర్శిటీకి చెందిన విద్యార్థులు ఈసారి స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చారు. ఎన్ఎస్ యూఐ, గోవా ఫార్వ‌ర్డ్ విద్యార్థి కూట‌మికి జేజేలు ప‌లికారు. విద్యార్థి సంఘాల ఎన్నిక‌ల్లో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసిన కాంగ్రెస్ గోవా ఫార్వ‌ర్డ్ కూట‌మి అభ్య‌ర్థుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు గోవా రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. ఇదే స‌మ‌యంలో ఓట్లు వేసిన ప్ర‌తి ఒక్క విద్యార్థిని అభినందించారు.