సంజూ శాంస‌న్ కు ఇదే ఆఖ‌రి ఛాన్స్

VijayaBhaskar · January 25, 2026
Spread the love

ఆడ‌క‌పోతే ఇక ఇంటికే ప‌రిమితం

హైద‌రాబాద్ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, మాజీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. ఏరికోరి న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ . కానీ అద్బుత‌మైన ఈ అవ‌కాశాన్ని చేజేతులారా చెడ‌గొట్టుకున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల‌లో రెండు అంకెల స్కోర్ కూడా చేయ‌క పోవ‌డం తో త‌న కెరీర్ ఇప్పుడు డైల‌మాలో ప‌డింది. ఇక జ‌ర‌గ‌బోయే టి20 మ్యాచ్ లో గ‌నుక రాణించ‌క పోతే త‌ను శాశ్వ‌తంగా బెంచ్ కే ప‌రిమితం అయ్యే ప్ర‌మాదం పొంచి ఉంది. కెరీర్ ప‌రంగా చూస్తే మూడవ టీ20 మ్యాచ్ సంజు కెరీర్‌కు చాలా కీలకమైనది. త‌ను ఈ మ్యాచ్‌లో చాలా బాగా రాణించాల్సి ఉంది.

సంజు శాంస‌న్ గ‌నుక‌ మరోసారి విఫలమైతే, భవిష్యత్తులో అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మరో అవకాశం లభించక పోవచ్చు.దీనికి కారణం, ఇంగ్లాండ్ సిరీస్‌లో సంజు బ్యాట్స్‌మన్‌గా అంతగా రాణించక పోవడమే. అహ్మదాబాద్ టీ20లో అతను బాగానే ఆడినట్లు కనిపించినా త్వ‌ర‌గా అవుటయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో కూడా అతను పరుగులు చేయలేక పోయాడు. ఇక నాలుగవ లేదా ఐదవ టీ20లో తిలక్ వర్మ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు, తిలక్ వర్మ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు. ఇషాన్ కిషన్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నందున, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ , కోచ్ గౌతమ్ గంభీర్ ఇషాన్ కిషన్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడానికి ఇష్టపడరు.