newsseals.com
SPORTS

సంజూ శాంస‌న్ స‌త్తా చాట‌డం ఖాయం

VijayaBhaskar January 30, 2026
newsseals-SureshRaina
Spread the love

మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా కామెంట్స్

చెన్నై : భార‌త స్టార్ క్రికెట‌ర్ సురేష్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన కేర‌ళ ప్లేయ‌ర్ సంజూ శాంస‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించాడు. త‌న పూర్ ఫామ్ పై స్పందిస్తూ మంచి భ‌విష్య‌త్తు ఉంద‌న్నాడు. శాంస‌న్ మామూలు ప్లేయ‌ర్ కాడ‌ని, త‌ను ఒక్క‌సారి పుంజుకోవ‌డం స్టార్ట్ చేస్తే అద్భుత‌మైన ఇన్నింగ్స్ లు ఆడ‌తాడ‌ని, ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు రైనా. త‌ను ఐపీఎల్ లోనే కాదు జాతీయ జ‌ట్టు ప‌రంగా ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయ‌ని పేర్కొన్నాడు. ఫుట్ వ‌ర్క్ ప‌రంగా కొంత మార్చుకుంటే ప‌రుగులు వ‌ర‌ద‌లై పార‌డం ప‌క్కా అని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశాడు సురేష్ రైనా.

త‌ను బ్యాటింగ్ ప‌రంగా టాప్ లో ఉన్నాడ‌ని, కానీ తిరిగి పుంజుకోవాలంటే త‌న‌కు ఒకే ఒక్క మ్యాచ్ చాలు అని పేర్కొన్నాడు. సంజూ శాంస‌న్ కు సెంచరీ చేసే సామర్థ్యం ఉందని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. అతను ఇప్పటికే దక్షిణాఫ్రికాలో రెండు సెంచరీలు చేశాడని తెలిపాడు. అభిషేక్ శర్మ , ఇషాన్ కిషన్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు కూడా సెంచరీ చేయగలరు. కానీ ఎలాగో నాకు అనిపిస్తుంది, ఈ టీ20 ప్రపంచ కప్‌లో సంజు సెంచరీ చేయగలడని అని ఫుల్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ గురించి. ఇదిలా ఉండ‌గా త‌ను చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.