newsseals.com
News

ఉపాధి హ‌మీ చ‌ట్టం కోసం కాంగ్రెస్ యుద్ధం

VijayaBhaskar January 31, 2026
newsseals-YSSharmila
Spread the love

ప్ర‌క‌టించిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. కోట్లాది మందికి జీవ‌నోపాధి క‌ల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కావాల‌ని చ‌ట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల క‌డుపు కొట్టేందుకు ఈ చ‌ట్టంలో మార్పులు తీసుకు వ‌చ్చార‌ని ఆరోపించారు. ఏదో ఒక రోజు కేంద్ర స‌ర్కార్ కు ప్ర‌జ‌లు బుద్ది చెప్పే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు. విజ‌య‌వాడ‌లో ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ప్ర‌త్యేకించి జాతీయ ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్బంగా త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిబ్రవరి 2 నుంచి చేపట్టే ఉపాధి హామీ పరిరక్షణ యాత్రపై జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ష‌ర్మిలా రెడ్డి. అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి చేపట్టే యాత్రను దిగ్విజయం చేసే విధంగా, మన్రేగా చట్టంతో జరిగే లబ్ధిని, ప్రధాని మోదీ తెచ్చిన VB G RAM G (గ్రామ్ జి) చట్టం ద్వారా జరిగే నష్టాన్ని ఉపాధి హామీ పథకం లబ్ధి దారులకు వివరించాలని పిలుపునిచ్చారు. గ్రామ్ జి చట్టాన్ని రద్దు చేసేలా ఉద్యమ కార్యాచరణ ఉండాలని నాయకత్వానికి దిశా-నిర్దేశం చేశారు ష‌ర్మిలా రెడ్డి. ఇందులో సీనియ‌ర్ నాయ‌కులు కొప్పులు రాజు కూడా హాజ‌ర‌య్యారు.