newsseals.com
News

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు

VijayaBhaskar February 1, 2026
newsseals-UnionBudget2026
Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఆర్థిక శాఖ మంత్రి

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం ఆదివారం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.
ఈ మేర‌కు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు చేస్తామ‌న్నారు. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, అరకు, పశ్చిమ కనుమల్లో పర్యటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో తాబేలు కేంద్రాలు అభివృద్ధి ప‌రుస్తామ‌ని పేర్కొన్నారు నిర్మ‌లా సీతారామ‌న్‌. ఈ పర్యాటక కేంద్రాల్లో శాశ్వత అభివృద్ధి కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అంతరాయం లేని రవాణా మార్గాలు ఏర్పాటు దిశగా అన్వేషణ చేస్తున్నామ‌న్నారు.

ఇక ఐటీ , ప‌న్నుల చ‌ట్టం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి. ట్యాక్స్ నిబంధనల్లో సడలింపు చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు . TCS 5% నుంచి 2 శాతానికి తగ్గిస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో పాటు మోటార్ యాక్సిడెంట్‌ చెల్లింపులపై పన్ను సడలిస్తున్నామ‌న్నారు. ప‌న్ను చెల్లంపుదారుల‌కు తీపి క‌బురు చెప్పారు. మార్చి 31 వరకు ఆదాయపన్ను చెల్లింపుకు గడువు పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు. జులై 31 వరకు ఐటీఆర్ 1, ఐటీఆర్ 2: విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్‌ టైమ్ స్కీమ్ అమ‌లు చేస్తామ‌న్నారు. చిన్న తరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు 6 నెలల ఊరట క‌ల్పించారు.