newsseals.com
News

ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Posted by: VijayaBhaskar February 7, 2026
newsseals-PawanKalyan

తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో కల్తీ నెయ్యి వాడారని ఫైర్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చిందన్నారు. మనందరిలో దేవుడిపై భయం ఉందన్నారు, ధర్మంపై గౌరవం ఉంద‌న్నారు. హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నామని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ విధానం ఖచ్చితంగా మారాలన్నారు.

కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటేన‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత కావాల‌ని పిలుపునిచ్చారు. మౌనంగా ఉంటే ఎలా అని ప్ర‌శ్నించారు డిప్యూటీ సీఎం. అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుందన్నారు. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని అన్నారు. కేవలం మన ధర్మాన్ని మనం రక్షించు కోవడ‌మేన‌ని పేర్కొన్నారు.