newsseals.com
SPORTS

క‌లిసికట్టుగా ఆడాం న‌మీబియాపై గెలిచాం

VijayaBhaskar February 13, 2026
newsseals-SuryaKuumarYadav
Spread the love

భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. న్యూజిలాండ్ సీరీస్ లో నిరాశ ప‌రిచిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో తీసుకున్నారు. ఓపెన‌ర్ గా బ‌రిలోకి తొలి మ్యాచ్ లో ఆడిన స్టార్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ అనారోగ్యానికి గురి కావ‌డంతో త‌న స్థానంలో సంజూ వ‌చ్చాడు. వ‌చ్చీ రావ‌డంతోనే కేవ‌లం 8 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 22 ర‌న్స్ చేశాడు. మ‌రో వైపు ఇషాన్ కిషాన్ రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. న‌మీబియా బౌలర్ల‌ను ఊచ‌కోత కోశాడు.

ఆ సూర్య‌, హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడారు. మ్యాచ్ గెలుపొందిన అనంత‌రం సూర్య కుమార్ యాద‌వ్ మీడియాతో మాట్లాడాడు. ఇది సుల‌భ‌మైన వికెట్ కాద‌ని అన్నాడు. అయితే ఇషాన్ కిష‌న్ , శాంస‌న్ ప్రారంభించిన విధానం బాగుంద‌న్నాడు. శివ‌మ్ దూబే, పాండ్యా ఆడిన విధానం సూప‌ర్ అని పేర్కొన్నాడు కెప్టెన్. ఇది జ‌ట్టుకు శుభ సూచ‌కం అని చెప్పాడు. ఇక నుంచి త‌మ‌కు ప్ర‌తి మ్యాచ్ చాలా ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశాడు. రాబోయే రోజుల్లో తాము ప్ర‌తి మ్యాచ్ ను గెలుపొందాల‌ని తాము ఆడుతామ‌ని చెప్పాడు సూర్య కుమార్ యాద‌వ్.