ఏఎంబీ సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్

VijayaBhaskar · February 21, 2026
Spread the love

సోష‌ల్ మీడియాలో మ‌హేష్ బాబు వైరల్

బెంగ‌ళూరు : టాలీవుడ్ లో టాప్ హీరో గా పేరు పొందిన ప్రిన్స్ మ‌హేష్ బాబు సంచ‌ల‌నంగా మారారు. తను న‌టుడే కాదు వ్యాపారంలో కూడా స‌క్సెస్ అయ్యాడు. త‌ను వివిధ రంగాల‌లో పెట్టుబ‌డులు పెట్టాడు కూడా. ఈ త‌రుణంలో తాను ఏర్పాటు చేసిన ఏఎంబీ సినిమాస్ ఇప్ప‌టికే ప్రాచుర్యం ఉంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో ఏఎంబీని ఓపెన్ చేశాడు. ఇది స‌క్సెస్ ఫుల్ గా న‌డుస్తోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ త‌రుణంలో ఇదే ఐమ్యాక్స్ థియేట‌ర్ ను క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో గ్రాండ్ గా నిర్మించారు. ఇది గ‌త జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైంది. ఇదిలా ఉండ‌గా ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న వార‌ణాసి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

దీంతో త‌ను త‌న ఏఎంబీని ప్రారంభించ‌లేక పోయాడు. షూటింగ్ లో కొంత విరామం తీసుకుని ఆ వెంట‌నే బెంగ‌ళూరుకు చేరుకున్నాడు. తాజాగా భారీ అభిమానుల గ్రాండ్ వెల్ క‌మ్ తో బెంగ‌ళూరుకు చేరుకున్నాడు ప్రిన్స్ మ‌హేష్ బాబు. దీనిని గ్రాండ్ గా ఓపెనింగ్ చేశాడు. బెంగళూరులోని చారిత్రాత్మక సినిమా హాల్ ఉన్న చోటే మహేష్ బాబు తన కొత్త సినిమా థియేటర్ ను ప్రారంభించారు. గతంలో బెంగళూరులోని గాంధీ నగర్‌లో చాలా సినిమా హాళ్లు ఉండేవి. వాటిలో కపాలి సినిమా థియేటర్ ఒకటి. ఇక్కడ చాలా సూపర్ హిట్ సినిమాలు ఆడాయి. ఇప్పుడు కొత్త సినిమా హాల్‌కు ‘ఏఎంబీ సినిమాస్ కపాలి’ అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి.