newsseals.com
SPORTS

నేనేమీ నిరూపించు కోవాల్సిన అవ‌స‌రం లేదు

Posted by: VijayaBhaskar March 27, 2026
newsseals-ShubhMannGill

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శుభ్ మ‌న్ గిల్

ముంబై : భార‌త టెస్టు, వ‌న్డే ఫార్మాట్ ల జ‌ట్ల స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రేప‌టి నుంచి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభాన్ని పుర‌స్క‌రించుకుని శుభ్ మ‌న్ గిల్ మీడియాతో మాట్లాడారు. భారత జట్టు విజయవంతంగా సాగించిన T20 ప్రపంచ కప్ ప్రచారానికి దూరమవడం గురించి ప్రశ్నించినప్పుడు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు. తనకు ఎటువంటి విచారం లేదని, తాను ఇప్పటికే నిలకడగా భారీ పరుగులు సాధిస్తున్నందున తన నైపుణ్యాలను ఎవరికీ నిరూపించు కోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఈ IPL సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ట్రోఫీని గెలుచు కోవడంపై శుభ్ మ‌న్ గిల్ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గత మూడు నుండి నాలుగు IPL సీజన్లలో నేను అత్యధిక పరుగులు సాధించాను, ఒక బ్యాట్స్‌మన్‌గా నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. ఇత‌ర ఫార్మాట్ ల గురించి తాను ఎక్కువ‌గా ఆలోచించ‌డం లేద‌న్నాడు. మ‌రో వైపు టి20 ఫార్మాట్ కు కూడా శుభ్ మ‌న్ గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేయాల‌ని బీసీసీఐ ఆలోచిస్తున్న‌ట్లు టాక్.