స్వ‌ర్ణాంధ్ర ఫౌండేష‌న్ కు ఒప్పో భారీ విరాళం

VijayaBhaskar · April 2, 2026
Spread the love

రూ. 50.59 ల‌క్ష‌ల చెక్కును అందించిన ఎండీ

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ముందు చూపుతో ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని స్వ‌ర్ణాంధ్ర అభివృద్ది కోసం పీ4 ఫౌండేష‌న్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వివిధ పేరు పొందిన వ్యాపార‌, వాణిజ్య‌, లాజిస్టిక్, ఐటీ , త‌దిత‌ర కంపెనీల‌న్నీ విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చాయి. ఇందులో భాగంగా భారీ విరాళాన్ని ప్ర‌క‌టించింది ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ సంస్థ ఒప్పో.

స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ కోసం ఒప్పో ఎండి తస్లీమ్ ఆరిఫ్ రూ.50.59లక్షల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు సచివాలయంలో కలిసి అందజేశారు. పేదరిక నిర్మూలన కోసం తెచ్చిన పీ4 కార్యక్రమం స్పూర్తిదాయకమని తస్లీమ్ ఆరిఫ్ కొనియాడారు. ఈ సందర్భంగా భారీ విరాళాన్ని అందించినందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున తస్లీమ్ ను సీఎం అభినందించారు. దీనిని స్పూర్తిగా తీసుకుని మిగ‌తా కంపెనీలు కూడా విరాళాలు ఇచ్చేందుకు భారీ ఎత్తున త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు.