newsseals.com
SPORTS

ఇషాన్ కిష‌న్ ధ‌నా ధ‌న్ రాజ‌స్థాన్ లాస్

VijayaBhaskar April 14, 2026
newsseals-IShanKishan
Spread the love

19 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే రాయ‌ల్స్ క్లోజ్

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న ఆ జ‌ట్టు స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్లు ప్ర‌పుల్ హింగే, న‌కీబ్ హ‌స్స‌న్ ల బౌలింగ్ దెబ్బ‌కు విల విల లాడారు. బంతుల‌ను ఆడ‌లేక వికెట్ల‌ను పారేసుకున్నారు. చివ‌ర‌కు ఫెరీరా, ర‌వీంద్ర జ‌డేజాలు ఆదుకున్నారు. దీంతో ప‌రువు పోకుండా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను కాపాడారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా హింగే రికార్డు సృష్టిస్తే..తనదైన పేస్‌తో సకీబ్‌..రాయల్స్‌ నడ్డివిరిచాడు. బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతులను ఆడటంలో రాయల్స్‌ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.

ఈ స‌మ‌యంలో రాజ‌స్థాన్ క‌నీసం 50 ప‌రుగులైనా చేస్తుందా అన్న అనుమానం నెల‌కొంది. ఈ త‌రుణంలో ఫెరీరా, జ‌డేజాలు అడ్డు గోడ‌లా నిల‌బ‌డ్డారు. ఫ‌రీరా 44 బాల్స్ ఎదుర్కొని 69 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక జ‌డేజా 32 బంతులు ఎదుర్కొని 45 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. 19 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. అంత‌కు ముందు టాస్ కోల్పోయి మైదానంలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు సూప‌ర్ షో చేసింది. కెప్టెన్ కిష‌న్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. త‌ను 44 బాల్స్ ఎదుర్కొని 91 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు , 6 సిక్సులు ఉన్నాయి. త‌న‌తో పాటు క్లాస‌న్ కూడా దంచి కొట్టాడు.