newsseals.com
ENTERTAINMENT

త‌మిళ‌నాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజ‌య్

Posted by: VijayaBhaskar May 10, 2026
newsseals-SanamShetty

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టి స‌న‌మ్ శెట్టి

చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు నేను మన ప్రియమైన ‘దళపతి’ విజయ్ కోసం ఇక్కడ నిలబడి ఉన్నానని అన్నాడు. ఈ ‘మాతృ దినోత్సవం’ నాడు, తమిళనాడుకు చెందిన మన నిజమైన పుత్రుడు అని ప్ర‌శంసించారు. ప్రజల ముఖ్యమంత్రి అయిన దళపతి పదవీ బాధ్యతలు స్వీకరించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

మన జోసెఫ్ విజయ్ చంద్ర‌శేఖ‌ర్ గురించి వినని వారు ఎవరూ ఉండరు విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించినందుకు తాము ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు స‌న‌మ్ శెట్టి. ఈ క్ష‌ణాల కోసం ఎదురు చూడ‌ని క్ష‌ణం అంటూ లేద‌న్నారు న‌టి. ఈ ప్రయాణం ఏమాత్రం సులభంగా సాగలేదని చెప్పారు. గత రెండేళ్లు అత్యంత క్లిష్టంగా, సవాలుతో కూడి ఉన్నాయ‌న్నారు. కేవలం ఒక్క వ్యక్తి మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేశారన్నారు.