newsseals.com
SPORTS

మ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ

VijayaBhaskar May 18, 2026
newsseals-ViratKohli
Spread the love

ప‌రుగుల వేట‌లో ర‌న్ మెషీన్ సూప‌ర్

ధ‌ర్మ‌శాల : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ విరాట్ కోహ్లీ స‌త్తా చాటాడు. ఈ ఐపీఎల్ 19 సీజ‌న్ లో వ‌రుస ఫామ్ తో ఆక‌ట్టుకున్నాడు. కీల‌క మ్యాచ్ లో భాగంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర్మశాల వేదిక‌గా జ‌రిగింది. ముందుగా బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 222 ర‌న్స్ చేసింది.
అయ్య‌ర్ 40 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 73 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిస్తే కోహ్లీ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 58 ప‌రుగులు చేయ‌డంతో భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీకి ఇది 9వ విజ‌యం కాగా పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు ఇది వ‌రుస‌గా ఆరోసారి కావ‌డం విశేషం.

భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే చాప చుట్టేసింది. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ లో శశాంక్‌ సింగ్ ఒక్క‌డే ఆడాడు. త‌ను 27 బంతులు ఎదుర్కొని 56 ర‌న్స్ చేశాడు. పంజాబ్ ప్లేయ‌ర్లు ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాల‌ని అనుకున్న అయ్య‌ర్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. అయినా శ‌శాంక్ జట్టును గెలిపించలేక పోయాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో మ‌రోసారి స‌త్తా చాటారు స‌లామ్ 36 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే భువ‌నేశ్వ‌ర్ కుమార్ 38 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.