హైద‌రాబాద్ లో భారీ అవినీతి తిమింగ‌లం ప‌ట్టివేత‌

VijayaBhaskar · May 19, 2026
Spread the love

HMWSSB జనరల్ మేనేజర్ ఆభ‌ర‌ణాలు, నోట్ల క‌ట్ట‌లు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో మ‌రో భారీ అవినీతి తిమింగ‌లం ప‌ట్టుబ‌డింది. మంగ‌ళ‌వారం ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని స‌మాచారం రావ‌డంతో అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) ఏక‌కాలంలో దాడులు చేప‌ట్టింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ( HMWSSB) జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన నివాసంలో. ఈ దాడుల‌లో క‌ళ్లు చెదిరేలా నోట్ల క‌ట్ట‌లు, బంగారు ఆభ‌ర‌ణాలు బ‌య‌ట ప‌డ్డాయి. అంత‌కు మించి అక్ర‌మంగా కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన ప‌త్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌దు ఏకంగా రూ. 1.06 కోట్లు ల‌భించ‌డంతో విస్తు పోయారు ఏసీబీ సిబ్బంది.

అక్రమాస్తుల కేసులో భాగంగా HMWSSB రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ (GM) అయిన కుమార్ నివాసంపై మంగళవారం ACB అధికారులు సికింద్రాబాద్‌లో దాడులు నిర్వహించారు . ఈ సోదాల సమయంలో అధికారులకు బంగారు ఆభరణాలు , పలు ఆస్తి పత్రాలు కూడా లభించాయి. బ్యాంకు లాకర్లను ఇంకా తెరవాల్సి ఉంది ఇప్ప‌టి దాకా రూ. 1.05 కోట్ల నగదు, భారీగా బంగారం, వెండి లభించిన‌ట్లు ఏసీబీ ప్ర‌క‌టించింది. జనరల్ మేనేజర్ నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ప‌లు చోట్ల ఇంకా సోదాలు కొన‌సాగుతున్నాయి.