కొలువు తీరిన త‌మిళ‌నాడు కొత్త కేబినెట్

VijayaBhaskar · May 21, 2026
Spread the love

అన్ని సామాజిక వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్య‌త

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గురువారం మ‌రో 23 మందికి నూత‌న కేబినెట్ లో చోటు క‌ల్పించారు. ఇందులో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు సీఎం. ఇదే క్ర‌మంలో టీవీకేకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. మిగ‌తా ముస్లిం లీగ్, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు బ‌య‌టి నుంచి విజ‌య్ స‌ర్కార్ కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. విశ్వ‌స‌నీయ వర్గాల సమాచారం ప్రకారం మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవుల కేటాయింపును విజయ్ ప్రధానంగా జాన్ అరోకియసామి, ఎన్. ఆనంద్ చేసిన సిఫార్సుల ఆధారంగానే చేపట్టారు.

ముఖ్యంగా ‘విజయ్ మక్కల్ ఇయక్కం’కు చెందిన 16 మంది సభ్యులను మంత్రులుగా నియమించారు. మంత్రివర్గంలో తన దీర్ఘకాలిక మద్దతుదారులకు తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడాలని విజయ్ ఆకాంక్షించినట్లు తెలుస్తోంది. అయితే, ఆ వ్యక్తులను గుర్తించి ఎంపిక చేసే బాధ్యతను ఆనంద్‌కు అప్పగించారు . అదే సమయంలో, శాఖల కేటాయింపున‌కు సంబంధించిన నిర్ణయాలు, అలాగే ముస్లిం లీగ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన రాజకీయ ఆవశ్యకత వంటి అంశాలపై జాన్ ప్రభావం బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. జాన్ చేసిన సూచనలను విజయ్ నిశితంగా ఆలకించి, మంత్రివర్గ కూర్పులో వాటిని తుది రూపంలో పొందుపరిచినట్లు భావిస్తున్నారు.