newsseals.com
News

మున్నూరు కాపుల అభివృద్దికి పాటుప‌డాలి

VijayaBhaskar May 24, 2026
newsseals-PonnamPrabhakar
Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : మున్నూరు కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ తో పాటు స‌భ్యులు మున్నూరు కాపుల సంక్షేమానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా బొమ్మ శ్రీ‌రామ్ నియమితులైన సందర్భంగా కరీంనగర్‌లోని ఇందిరా గార్డెన్స్‌లో గల DCC కార్యాలయంలో నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఆయ‌న‌తో పాటు SC , ST సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చోప్పదండి ఎమ్మెల్యే , కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే, TPCC SC సెల్ ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే M. S. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.

వీరితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ అంజన్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేష్, SUDA ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఒడితెల ప్రణవ్, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ కర్ర రాజశేఖర్, MLC అభ్యర్థులు పట్టాభిరాముల , ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని శుభాకాంక్ష‌లు తెలిపారు.