newsseals.com
News

నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

VijayaBhaskar May 24, 2026
newsseals-CMVijay
Spread the love

ప్ర‌క‌టించిన సీఎం జోసెఫ్ విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు .మరణించిన బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితులకు చట్టం ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తానని కూడా ఆయన తమకు హామీ ఇచ్చారని ఆ బాలిక తల్లిదండ్రులు తెలిపారు. POCSO చట్టం కింద కోయంబత్తూరుకు చెందిన ఆ బాలిక కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం అందించడం జ‌రిగింద‌న్నారు.ముఖ్యమంత్రి విజయ్ ఫోన్ ద్వారా వారిని సంప్రదించి, తన సానుభూతిని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా బాలిక వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. కొత్త‌గా కొలువు తీరిన టీవీకే స‌ర్కార్ వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. సీఎం విజ‌య్ ఆదేశాల మేర‌కు ఇప్ప‌టికే మంత్రులు ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. నిందితులు ఎక్క‌డ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఎవ‌రైనా స‌రే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.