పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి

VijayaBhaskar · May 25, 2026
Spread the love

పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గోదావ‌రి న‌దిలో కాలుష్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. ఇందు కోసం ఆయా ప‌రిశ్ర‌మ‌లు ఫోక‌స్ పెట్టాల‌న్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుకునేంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించునున్న ఈ పుష్కరాలకు గోదావరి జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తల సహకారం అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

.తగిన చొరవ తీసుకొని పుష్కరాల నిర్వహణలో పారిశ్రామికవేత్తలు కూడా తగిన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొన్నారు. పుష్కరాల విజయవంతానికి పరిశ్రమల నిర్వాహకుల చొరవ చాలా అవసరం అన్నారు. ప్రభుత్వానికి తగిన విధంగా సహకరించాలని కోరారు డిప్యూటీ సీఎం. ఈ సమావేశంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య , అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పారిశ్రామిక‌వేత్త‌లు సైతం ప‌లు సూచ‌న‌లు చేశారు డిప్యూటీ సీఎంకు.