newsseals.com
SPORTS

వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో సీఎస్కేలో కీల‌క మార్పులు

VijayaBhaskar May 26, 2026
newsseals-CSKManagement
Spread the love

చేయాల‌ని యోచిస్తున్న జ‌ట్టు యాజ‌మాన్యం

చెన్నై : ఇండియ‌న్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్ల‌ను సాధించిన ఘ‌న‌త వ‌హించిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డింది. దాని బ్రాండ్ వాల్యూ చెక్కు చెద‌ర‌క పోయిన‌ప్ప‌టికీ ఆశించిన మేర జ‌ట్టు రాణించ‌క పోవ‌డం ఇబ్బందిగా మారుతోంది. ఈ త‌రుణంలో జ‌ట్టుకు వెన్నెముక‌గా ఉంటూ వ‌చ్చిన ఇండియ‌న్ జార్ఖంగ్ డైన‌మెంట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ప్ర‌త్య‌క్షంగా ఏ ఒక్క మ్యాచ్ లోనూ ఆడ‌లేదు. త‌ను దాదాపుగా ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన‌ట్టే భావించాల్సి ఉంటుంది. ఈ త‌రుణంలో భారీ ధ‌ర‌కు ట్రేడింగ్ లో కొనుగోలు చేశారు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ టీం నుంచి కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను. ఏకంగా రూ. 18 కోట్ల‌కు తీసుకున్నారు. కానీ త‌ను కూడా ఆశించినంత‌గా ఆడ‌లేక పోయాడు. అడ‌పా ద‌డ‌పా సెంచ‌రీలు చేసిన‌ప్ప‌టికీ కీల‌క మ్యాచ్ ల‌లో చేతులెత్తేశాడు.

దీంతో జ‌ట్టు లో మార్పులు త‌ప్ప‌కుండా చేయాల్సి వ‌స్తుంద‌ని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ త‌రుణంలో ప్ర‌ధానంగా వ‌చ్చే ఐపీఎల్ 20 సీజ‌న్ లో జ‌ట్టుకు సంబంధించి హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు ప్ర‌స్తుతం కెప్టెన్ గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ను త‌ప్పించ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో హెడ్ కోచ్ తో పాటు కెప్టెన్ ను కూడా మార్చ‌నుంది. సాధ్య‌మైనంత వ‌ర‌కు ధోనీకి తెలియ‌కుండా ఏదీ జ‌ర‌గదు. త‌న వారసుడు ఎవ‌ర‌నేది ఇంకా ప్ర‌క‌టించ‌క పోయిన‌ప్ప‌టికీ సంజు శాంస‌న్ ను ఏరికోరి తీసుకోవ‌డం వెనుక త‌న ప్ర‌మేయం ఉంది. దీంతో త‌న‌నే త‌దుప‌రి కెప్టెన్ కానున్నాడ‌ని టాక్.