క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామా

VijayaBhaskar · May 28, 2026
Spread the love

విధానసౌధలో రాజీనామా లేఖను సమర్పించిన సీఎం

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఆయ‌న గురువారం విధాన సౌధ‌లో రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ ప‌ని మీద మ‌రాఠాకు వెళ్లారు. దీంతో విధాన‌స‌భ‌లో కార్య‌ద‌ర్శికి రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా రాజ‌కీయ ఉత్కంఠ‌కు, చ‌ద‌రంగానికి తెర ప‌డిన‌ట్ల‌యింది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక సీఎం గా త‌నే కొలువు తీరారు. ముందుగా డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివ‌కుమార్ సీఎం ప‌ద‌విని ఆశించారు. చివ‌రి దాకా టెన్ష‌న్ కు తెర తీశారు. కానీ హైక‌మాండ్ త‌న‌పై ఉన్న కేసుల కార‌ణంగా అత్యంత సీనియ‌ర్ , విధేయుడైన సిద్ద‌రామ‌య్య‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది.

అయితే కొంత కాలం పాటు సీఎంగా సిద్ద‌రామ‌య్య‌, మ‌రికొంత కాలం పాటు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. కానీ ఎంత‌కూ సీఎం ప‌ద‌వి నుంచి దిగేందుకు ఒప్పుకోక పోవ‌డంతో ఉన్న‌ట్టుండి హైక‌మాండ్ ఇద్ద‌రు నేత‌ల‌ను ఢిల్లీకి పిలిపించింది. ఒకానొక ద‌శ‌లో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను సీఎంగా ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు స‌మాచారం అందింది. కానీ ఏమైందో ఏమో కానీ హైక‌మాండ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన డీకే శివ‌కుమార్ కు సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది.