వైభవ్ సూర్యవంశిపై మొయిన్ అలీ షాకింగ్ కామెంట్స్

VijayaBhaskar · June 3, 2026
Spread the love

అత‌డు అద్భుత‌మైన ఆట‌గాడ‌ని కితాబు ఇచ్చిన క్రికెట‌ర్

పాకిస్తాన్ : భార‌త స్టార్ యంగ్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట తీరు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు పాకిస్తాన్ క్రికెట్ కు చెందిన క్రికెట‌ర్ మొయిన్ అలీ. త‌న జీవితంలో ఇలాంటి ఆట‌గాడిని చూడ‌లేద‌ని అన్నాడు. తాజాగా వైభ‌వ్ గురించి చేసిన కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే ఐపీఎల్ 19వ సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్ గా ప‌లు అవార్డులు అందుకున్నాడు బీహార్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టే ఛాన్స్ ఉంద‌న్నాడు మొయిన్ అలీ.

రాబోయే రెండేళ్లలో వైభవ్ సూర్యవంశి ప్రపంచంలోనే అత్యుత్తమ T20 బ్యాటర్‌గా అవతరించ బోతున్నాడని జోష్యం చెప్పాడు. నిజాయితీగా చెప్పాలంటే, అతను ఒక అద్భుతమైన బ్యాట్స్‌మెన్; ఇంత చిన్న వయసులో ఎవరూ ఇలా ఆడటం నేను ఇంతకు ముందెన్నడూ చూడలేద‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. కేవలం 20 నుండి 30 బంతుల్లోనే అతను 70 లేదా 80 పరుగుల స్కోరును వేగంగా చేరుకునే తీరు నిజంగా నమ్మశక్యం కానిదని అన్నాడు. రాబోయే రెండేళ్లలో, అతను క్రిస్ గేల్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే అవకాశం ఉందని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.