newsseals.com
News

రామ‌లింగారెడ్డి రాజీనామా ఒప్పిస్తాన‌న్న డీకేఎస్

VijayaBhaskar June 5, 2026
newsseals-DKShivaKumar
Spread the love

నేను అతనితో మాట్లాడి అంతా సరి చేస్తా

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్రంలో పాలిటిక్స్ మ‌రింత వేడెక్కాయి. కేబినెట్ లో క‌ల‌క‌లం మొద‌లైంది. పార్టీ హైక‌మాండ్ సూచ‌ల‌న మేర‌కు అట్ట‌హాసంగా సీఎంగా కొలువు తీరారు డీకే శివ‌కుమార్. ఈ స‌మ‌యంలో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న రామ‌లింగా రెడ్డికి కేబినెట్ లో చోటు ద‌క్కింది. అయితే త‌న‌కు కేటాయించిన శాఖ ప‌ట్ల తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ఉన్న‌ట్టుండి త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో త‌న‌కు మ‌ద్ద‌తుగా పెద్ద ఎత్తున నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రులు రామ‌లింగా రెడ్డికి స‌పోర్ట్ గా నిలిచారు. తాము కూడా మూకుమ్మ‌డిగా రాజీనామాలు స‌మ‌ర్పించారు. ఏం జ‌రుగుతుందో తెలియ‌డం లేదు.

అయితే రామ లింగా రెడ్డి త‌న‌కు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించాల‌ని కోరారు. కానీ త‌న‌కు ఆ శాఖ అప్ప‌గించ‌క పోవ‌డం గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత తలెత్తిన పరిణామాలను అదుపు చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఈ రాజీనామా ఇప్పుడు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రామలింగారెడ్డిని తన అత్యంత సన్నిహిత మిత్రుడిగా భావించే డీకే, ఈ సమస్య శాఖల కేటాయింపునకు సంబంధించినదే తప్ప ప్రభుత్వంలో విభేదాల వల్ల కాదని అంటున్నారు.