newsseals.com
SPORTS

భారత మ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టుకు మోదీ కంగ్రాట్స్

VijayaBhaskar June 7, 2026
newsseals-PMModi
Spread the love

శాఫ్ మ‌హిళా ఛాంపియ‌న్ షిప్ కైవ‌సం చేసుకున్న టీం

న్యూఢిల్లీ : గోవాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 3-1 తేడాతో ఘనవిజయం సాధించడం ద్వారా, భారత్ ఆరవసారి,, ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారిగా SAFF మహిళా ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది . ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. SAFF మహిళా ఛాంపియన్‌షిప్ 2026 గెలిచిన భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు అభినందనలు. టోర్నమెంట్ అంతటా వారు అద్భుతంగా ఆడారు. ఇది భవిష్యత్తులో మరింత మంది యువతను ఫుట్‌బాల్ ఆడేలా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. జట్టుకు వారి భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని మోదీ ‘X’ వేదికగా పేర్కొన్నారు.

మహిళా ఛాంపియన్‌షిప్ 2026 గెలిచిన భారత మహిళా ఫుట్‌బాల్ జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అభినందించారు. ఇది భవిష్యత్తులో మరింత మంది యువతను ఫుట్‌బాల్ ఆడేలా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. భారత్ ఆరవసారి , ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారిగా SAFF మహిళా ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను కైవసం చేసుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. రాబోయే రోజుల్లో మ‌రింత‌గా రాణించాల‌ని, మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆకాంక్షించారు.