పోలీసు శాఖలో సమన్వయంపై డీజీపీ ఫోక‌స్

VijayaBhaskar · June 9, 2026
Spread the love

స్టాఫ్ ఆఫీస‌ర్స్ మీటింగ్ తిరిగి ప్రారంభం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియ‌మితులైన సీవీ ఆనంద్ కీల‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. చాలా కాలంగా నిలిచి పోయిన “స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్”ను డీజీపీ మళ్లీ ప్రారంభించారు. ప్రతి పక్షం .సీనియర్ అధికారులు సమావేశమై విధానాలు, కార్యక్రమాలు, శాఖల మధ్య అంశాలపై చర్చిస్తున్నారు. నేపాల్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన గృహ కార్మికుల వివరాలను క్రమబద్ధమైన డేటాబేస్‌లో నమోదు చేసి పర్యవేక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

CCTNS 2.0, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్, AI, డ్రోన్లు, డేటా ఇంటెలిజెన్స్ వ్యవస్థల వినియోగాన్ని విస్తృతంగా పెంచడంపై సమీక్ష నిర్వహించారు డీజీపీ. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటుకు అవసరమైన పరిపాలనా వ్యవస్థ, మహిళా పోలీసుల సంక్షేమం, కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది-వాహనాల ఆడిట్ల వంటి అంశాలపై చర్చించారు. ఈ సంద‌ర్బంగా ప‌లువురు కీల‌క సూచ‌న‌లు చేశారు. వాటిని స్వీక‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు డీజీపీ సీవీ ఆనంద్.