newsseals.com
ENTERTAINMENT

భారతీరాజా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

Posted by: VijayaBhaskar June 10, 2026
newsseals-YSJagan

తీవ్ర సంతాపం వ్య‌క్తం చేసిన మాజీ సీఎం జగన్

తాడేప‌ల్లి గూడెం : ప్రముఖ దర్శకుడు, నటుడు, తమిళ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సినీ వ్యక్తిత్వం భారతీరాజా మరణం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పేర్కొన్నారు. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారని వైయస్ జగన్ అన్నారు.

దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేసిన భారతీరాజా ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో విశిష్ట పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారని తెలిపారు. భారతీరాజా మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ప్రార్థించారు.