newsseals.com
News

నేడే ఏపీ అన్న‌దాత సుఖీభ‌వ

Posted by: VijayaBhaskar June 20, 2026
newsseals-CM

చిల‌క‌లూరిపేట‌లో సీఎం పంపిణీ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో ప‌ర్య‌టిస్తారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పర్యటించనున్నారు. ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు.

2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి రాత్రి 6.20 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇదిలా ఉండ‌గా ఏపీలో కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ తమ తొలి ప్రాధాన్య‌త అన్న‌దాత‌ల సంక్షేమం ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.