newsseals.com
SPORTS

ఐర్లాండ్ తో సీరీస్ ఓడి పోవ‌డం బాధాక‌రం

VijayaBhaskar June 29, 2026
newsseals-ShreyasIyer
Spread the love

మా వాళ్లు ఇంకా మారాల్సి ఉంద‌న్న అయ్య‌ర్

ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జ‌రిగిన రెండు మ్యాచ్ లలో అత్యంత బ‌ల‌మైన భార‌త జ‌ట్టు ఘోరంగా ఓడి పోయింది. ఆట‌గాళ్ల పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న త‌ల దించుకునేలా చేసింది. స్వ‌దేశంలో జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకున్న జ‌ట్టేనా ఇది అన్న అనుమానం నెల‌కొంది. టి20 సీరీస్ ను 2-0 తేడాతో కోల్పోవ‌డం ప‌ట్ల స్పందించాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్. ఇది ఖచ్చితంగా గొప్ప సిరీస్ ఏమీ కాదు. కానీ ఐర్లాండ్ జట్టుకు అభినందనలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు.

వారు ఆడిన తీరు అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు. వారు వృత్తిపరమైన పరిణతిని ప్రదర్శించారు. పిచ్ ఎలా స్పందిస్తుందనే దానిపై వారికి మంచి అవగాహన ఉంది. కాబట్టి, వారికి అభినందనలు.
మా బౌలర్లు తమ ప్రణాళికలను బాగా అమలు చేశారు. అయితే, పిచ్ స్వభావాన్ని అంచనా వేయడంలో మేము కొంత వెనుకబడ్డామని నా అభిప్రాయం. సింగిల్స్‌ను డబుల్స్‌గా మార్చుకోవడం వంటి అంశాలపై మేము ఇంకాస్త దృష్టి సారించి ఉండాల్సిందిన్నాడు. ఏది ఏమైనా, ఇది మాకు ఒక కఠినమైన సిరీస్, దీని నుండి మేము పాఠాలు నేర్చుకుంటాం అన్నాడు అయ్యర్.