newsseals.com
News

క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

VijayaBhaskar July 2, 2026
newsseals-SonamWangchuk
Spread the love

ఐద‌వ రోజుకు చేరిన సీజేపీ నిర‌స‌న

న్యూఢిల్లీ : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో న్యూఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష గురువారం నాటితో 13వ రోజుకు చేరుకుంది. ఈ నిర‌స‌న‌లో నిరాహార‌దీక్ష‌కు కూర్చున్నారు ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారుడు సోన‌మ్ వాంగ్ చుక్. దీంతో ఆయ‌న ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ప్ర‌జాస్వామిక‌వాదులు, జ‌ర్న‌లిస్టులు, సమాజ సేవ‌కులు, జ‌ర్న‌లిస్టులు, త‌దిత‌రులు ఈ సీజేపీ ఉద్య‌మంలో పాలు పంచుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీజేపీ వ్య‌వస్థాక అధ్య‌క్షుడు అభిజీత్ దిప్కే. వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంద‌ని, ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు.

ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సమయంలో ఆయన రక్తంలో చక్కెర స్థాయి 60కి పడిపోగా, రక్తపోటు కూడా తక్కువగానే నమోదైంది. మరోవైపు, పదమూడవ రోజుకు చేరుకున్న ఈ ఆందోళనను మరింత విస్తృతం చేయడంపై నిరసనకారుల నుండి అభిప్రాయాలను సేకరించేందుకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే “చాయ్ పే చర్చా విత్ కాక్రోచెస్” (బొద్దింకలతో టీ-చర్చ) అనే కార్యక్రమాన్ని ప్రకటించారు.