నితిన్ న‌బిన్ ను ఎగ‌తాళి చేస్తే ఊరుకోం

VijayaBhaskar · July 2, 2026
Spread the love

బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సీరియస్ కామెంట్స్

ఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు సంబిత్ పాత్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ గురించి కించ ప‌రిచేలా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ను వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను ఎగతాళి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించడం దారుణ‌మ‌న్నారు . బహిరంగ స‌భ‌లో త‌మ పార్టీ అధినేత‌ను చుల‌క‌న చ‌సి మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. ఇలాగే కామెంట్స్ చేస్తూ పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి త‌న ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చెప్పాల్సింది పోయి సోయి లేకుండా త‌మ నాయ‌కుడి గురించి ఇలా చిల్ల‌ర మాట‌లు మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి వాడిన పదాలు అభ్యంతరకరమైనవి, ఖండించదగినవి మాత్రమే కాదు, అవి ఆయన అహంకారాన్ని, అలాగే కాంగ్రెస్ పార్టీ సంస్కృతినీ తెలియ చేస్తుంద‌న్నారు. ముఖ్యంగా ఆ పార్టీ ఒకే కుటుంబానికి దాసోహమై, మిగిలిన వారందరినీ విస్మరించి ఆ కుటుంబానికే అత్యంత ప్రాధాన్యతనిచ్చే ధోరణిని బయట పెట్టాయన్నారు. రేవంత్ రెడ్డి .. భారతదేశపు అతిపెద్ద రాజకీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పేరు మీకు తెలియకపోతే, మీరు కనీసం భారతీయ రాజకీయ శాస్త్ర విద్యార్థిగా ఉండటానికి కూడా అనర్హులు అని పేర్కొన్నారు.