యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలు’

హైదరాబాద్ : తెలంగాణ అంటేనే సుసంపన్నమైన చారిత్రిక , పోరాట స్పూర్తి కలిగిన ప్రాంతం. ఇక్కడ పోరాటాలే కాదు అద్భుతమైన సంస్కృతికి దర్పణంగా నిలుస్తూ వచ్చింది. ప్రత్యేకించి చెప్పాల్సి వస్తే జానపదాలు. ఒకప్పుడు తెలంగాణ అంటేనే పడని వారంతా ఇప్పుడు ఇక్కడి పదాలు, యాస, భాష, పాటలను, సంస్కృతిని ఒంట పట్టించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓ వైపు సినిమా రంగానికి సంబంధించి బూతులు, ద్వందర్థాలతో , హింసతో సినిమాలు వస్తుంటే మరో వైపు తెలంగాణ అచ్చమైన మట్టి వాసనతో గీతాలు, జానపదాలు దుమ్ము రేపుతున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఔత్సాహిక కళాకారులు తమ ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటున్నారు. ఇక నల్లగొండ కు చెందిన నాగ దుర్గ ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉంది. తను హీరోయిన్ కు మించి ఆదరణ పొందుతోంది.
ఇక తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన బాసింగ బలాలు పాట దుమ్ము రేపుతోంది. యూట్యూబ్ ను, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏకంగా విడుదలైన నాటి నుంచి నేటిదాకా రెండున్నర కోట్ల వ్యూస్ కు చేరుకుని అరుదైన రికార్డును స్వంతం చేసుకుంది. పెళ్లి ప్రాముఖ్యతను చెప్పేలా దీనిని రాసి, రూపొందించారు. కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ పాటను విజయ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేశారు. దీనిని ఎంతో ప్రేమతో, భారీ ఖర్చుతో నిర్మించారు సతీష్ రెడ్డి బండి, శైఖర్ వైరస్ అందించిన కొరియోగ్రఫీ ఈ పాటకు హైలెట్ గా నిలిచింది. ఇక కళ్యాణ్ కేస్ ఇచ్చిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆడేలా చేసింది. స్వామి నరేష్ దుబ్బా మనసు పెట్టి పాటను రాశాడు. అంతే కాదు దీనిని తనే శ్రీనిధి తో కలిసి హృదయాలను మీటేలా పాడారు. అచ్చమైన మట్టి వాసన అందించిన ఈ పాట ఇప్పుడు మరో సెన్సేషన్ సృష్టించేందుకు రెడీ అయ్యింది. నిర్మించిన రెడ్డికి, ఇతర సాంకేతిక నిపుణులకు , గాయనీ గాయకులకు ప్రత్యేక అభినందనలు. ఇలాంటి పాటలను ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి.