newsseals.com

టాక్సిక్ లో బోల్డు స‌న్నివేశాల్లో కియారా అద్వానీ

July 9, 2026 · VijayaBhaskar

బెంగ‌ళూరు : ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపు దిద్దుకున్న మూవీ టాక్సిక్. ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించారు స్టార్ హీరో య‌శ్ , కియారా అద్వానీ తో పాటు ప‌లువురు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మూవీలో బోల్డ్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ప్ర‌ధానంగా కియారా అద్వానీ తో య‌శ్ స‌న్నిహితంగా ఉన్న సీన్స్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కియారా అద్వానీ 2023లో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. ఆమె ఒక కుమార్తెకు తల్లి. కెరీర్ పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గత 7 ఏళ్లుగా ఆమెకు ఎలాంటి హిట్ సినిమా లేదు.
టాక్సిక్’ చిత్రంలో బోల్డ్ సన్నివేశాల్లో నటించమని ఆమెను అడిగారు ద‌ర్శ‌కురాలు, నిర్మాత‌లు.

వివాహిత అయినందున అటువంటి పాత్రలో నటించడం సరికాదని ఆమె కుటుంబం అంగీకరించలేదు.
కానీ ఆమె వారి మాటను కాదని, దర్శకుడి ప్రతిపాదనకు అంగీకరించారు. థియేటర్లకు ప్రేక్షకులను ఆకర్షించడానికి దర్శకుడు కోరుకున్నది దక్కింది, అలాగే ఆమె పారితోషికాన్ని కూడా రెట్టింపు చేశారు.
వివాహం జరిగినప్పటికీ, గౌరవం కంటే డబ్బుకే ప్రాధాన్యతనిస్తూ ఆమె ఆ సన్నిహిత సన్నివేశాల్లో నటించాలని నిర్ణయించు కోవడం క‌ల‌క‌లం రేపుతోంది. టాక్సిక్ మూవీ కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్‌లో విడుదల కానుంది. ఇందులో కియారా అద్వానీతో పాటు న‌య‌నాత‌ర‌, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వ‌సంత్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Related News