బ్యాంకుల ఎస్ఎంఎస్ ఛార్జీలపై ఆర్బిఐ ఉక్కుపాదం
ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. SMS అలర్ట్‌లకు కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. నిబంధనల పాటింపు, అవగాహన, లేదా ప్రచార ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల పెద్ద బ్యాంకులకు ఫీజు ఆదాయంలో రూ. 300 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చు. చాలా బ్యాంకులు ప్రతి త్రైమాసికానికి రూ. 15-18 ఫీజుల ద్వారా తమ ఖర్చులను తిరిగి రాబట్టు కుంటున్నాయి. ఈ విషయం తమ విచారణలో తేలిందని పేర్కొంది ఆర్బీఐ. బ్యాంకులు ఈ భారాన్ని తామే భరించడమో లేదా పరోక్ష మార్గాలను వెతుక్కోవడమో చేసే అవకాశం ఉంది.
అంతేకాకుండా రూ. 500 , అంతకంటే తక్కువ లావాదేవీలకు పంపే ఎస్ఎంఎస్ అలర్ట్‌లను ఆర్బిఐ ఐచ్ఛికం (తప్పనిసరి కాదు) చేసింది. ఆర్బిఐ తీసుకున్నఈ నిర్ణయం వినియోగదారులకు మేలు చేకూర్చేలా చేసింది. ప్రత్యేక ఎస్ఎంఎస్ ఛార్జీల ద్వారా నేరుగా వసూలు చేయడానికి ఇకపై అనుమతి లేనందున, బ్యాంకులు ఈ ఖర్చును ఇతర మార్గాల్లో రాబట్టు కుంటాయని భావిస్తున్నారు. రుణదాతలు ఈ ఖర్చులను అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలు, కనీస బ్యాలెన్స్ అవసరాలు లేదా ఇతర లావాదేవీల ఫీజులలో చేర్చుతూ వస్తోంది. నిబంధనల పాటింపు, అవగాహన లేదా ప్రచార ప్రయోజనాల కోసం పంపే SMS అలర్ట్‌ల కోసం కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేయకుండా ఆర్బిఐ నిషేధించడంతో, భారతదేశంలోని బ్యాంకులు ఫీజు ఆదాయంలో కోట్ల వరకు నష్టపోవచ్చు.