కాసుల వర్షం కురిపిస్తున్న అఖిల్, బోర్సే ‘లెనిన్’
హైదరాబాద్ : మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన తాజా చిత్రం లెనిన్. ఇది జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజివిట్ టాక్ వచ్చింది. ఇందులో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని తో పాటు అందాల తార భాగ్యశ్రీ బోర్సే కీ రోల్ పోషించారు. ఈ ఇద్దరి నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ప్రత్యేకించి భాగ్యశ్రీ సూపర్ డ్యాన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పక తప్పదు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు ఈ చిత్రాన్ని నిర్మించారు.
శుక్రవారం ఒక్క రోజే లెనిన్ ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాదించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా.. అఖిల్ కెరీర్‌లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు ఇవేకావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అఖిల్, భాగశ్రీ బోర్సే నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక నేడు శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ చిత్ర కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో వైపు అఖిల్ తన భార్య జైనాబ్ తో కలిసి సినిమాను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.