newsseals.com

పీవీ సింధు మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాలి : సీఎం

July 19, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలుపొందిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్ర‌శంస‌లు కురిపించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పి.వి. సింధు టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్‌లో అద్భుతమైన అటాకింగ్ బ్యాడ్మింటన్ ప్రదర్శనతో స్థానిక క్రీడాకారిణి అకనే యమగుచిని వరుస గేమ్స్‌లో ఓడించి, తన కెరీర్‌లో తొలిసారిగా ‘సూపర్ 750’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. సింధు ఈ ఘనత సాధించడం భారత క్రీడారంగానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్‌లో తన తొలి ‘సూపర్ 750’ టైటిల్‌ను గెలుచుకున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధును ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. తన ప్రతిభ, కృషి , పట్టుదలతో దేశ యువతకు స్ఫూర్తినిస్తున్న సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. క్రీడా రంగానికి త‌మ ప్ర‌భుత్వం అనేక ర‌కాలుగా సాయం చేస్తోంద‌న్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు. క్రీడాకారుల‌కు మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Related News