ధర్మేంద్ర ప్రధాన్ ను ఏకి పారేసిన రేణుకా చౌదరి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టింది. వారి నిరసనను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. వారి ఆందోళనకు మద్దతు పలికారు లోక్ సభ ప్రతిపక్ష నేత , ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో తనను బలవంతంగా పోలీసులు లాక్కెళ్లారు. అదుపులోకి తీసుకున్నారు. ఒక ఎంపీని లోక్ సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేయకూడదు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఏకి పారేశారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి . నీట్ పేపర్ లీక్ విషయంలో అక్రమార్కుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కేంద్ర మంత్రిపార్లమెంట్ ఆవరణలో ఉండగా.. అక్కడికి రేణుకా చౌదరి వచ్చారు. పక్కనే నిలబడి మోదీ ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. నిన్నటి కాక్రోచ్ ఆందోళన.. నేటి రైతుల ఆందోళనను ఉద్దేశించి తీవ్రంగా విరుచుకు పడ్డారు. యూజ్ లెస్ ఫెలోస్ అంటూ విమర్శలు చేశారు రేణుకా చౌదరి. రేణుక అలా గట్టిగా వాయిస్ పెంచి ఎటాక్ చేస్తుండడంతో బిత్తరపోయిన ప్రధాన్ అటూ ఇటూ చూస్తూ మెల్లిగా అక్కడినుండి జారుకునే ప్రయత్నం చేశారు.. అయినప్పటికీ ఆమె వదలకుండా అతనితో పాటు మెట్లు దిగుతూ విమర్శల దాడి కొనసాగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.