newsseals.com

సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో న‌టుడు జై భేటీ

July 25, 2026 · VijayaBhaskar

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను క‌లిసేందుకు ప్ర‌ముఖులు క్యూ క‌డుతున్నారు. సినీ రంగానికి చెందిన వారు మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అవుతున్నారు. తాజాగా శ‌నివారం ప్ర‌ముఖ న‌టుడు జై త‌ల‌ప‌తి విజ‌య్ ను క‌లిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను స్వ‌యంగా ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు జై. త‌మ‌ భేటీకి సంబంధించిన ఫోటోను పంచుకుంటూ, ఆయన ‘X’ (ట్విట్టర్)లో ఇలా రాశారు. మంచి విషయాలు జరగడానికి సమయం పడుతుంది. గొప్ప విషయాలు తమకంటూ ఒక సమయాన్ని ఎంచుకుంటాయి అని పేర్కొన్నారు. ఇటీవల రాజకీయ విజయం సాధించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని అభినందించేందుకు సినీ ప్రముఖులు ఆయనను కలుస్తున్నారు. ఎన్నికల విజయం తర్వాత నటుడు జై కూడా సీఎం విజయ్‌ని కలిశారు.

ఇదిలా ఉండ‌గా న‌టుడు జై ఇటీవల ‘సట్టెండ్రు మారుదు వానిలై’ (Sattendru Maarudhu Vaanilai) చిత్రంలో కనిపించారు, ఇది థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియో , ఆహా (Aha)లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి బాబు విజయ్ దర్శకత్వం వహించారు. ‘జన నాయగన్’ (Jana Nayagan) చిత్రం థియేటర్లలో బాగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రానికి హెచ్. వినోత్ దర్శకత్వం వహించగా, కెవిఎన్ (KVN) ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. సీఎం విజయ్‌ని కలిసిన ఇతర ప్రముఖులలో శివకార్తికేయన్, సమంత రూత్ ప్రభు, విశాల్, దర్శకులు లోకేష్ కనగరాజ్, ఏఆర్ మురుగదాస్ , వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు ఉన్నారు.

Related News