newsseals.com
News

ఏవీ రంగ‌నాథ్ పై 63 ధిక్క‌ర‌ణ కేసులు

VijayaBhaskar July 27, 2026
newsseals-AVRaanganath

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డింది. త‌న నిర్వాకం దారుణంగా ఉంద‌ని, త‌నంత‌కు తాను ఇండిపెండెంట్ అధికారిన‌ని భావిస్తున్నారంటూ మండిపడంది కోర్టు. హైద‌రాబాద్ లోని లోతుకుంట భూముల వ్య‌వ‌హారానికి సంబంధించి మూడు సార్లు త‌నపై ఆగ్రహం వ్య‌క్తం చేసినా ప‌ట్టించుకోక పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. ఇది దారుణ‌మైన వ్య‌వ‌హారం అని పేర్కొంది కోర్టు. ఈ సంద‌ర్బంగా హైడ్రా (HYDRAA) కమిషనర్ ఎ. రంగనాథ్ స్థానంలో మరొకరిని నియమించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడే తెలంగాణ ప్రభుత్వ విభాగమైన ‘హైడ్రా’ అధిపతిగా భావిస్తున్న ఏవీ రంగ‌నాథ్ కు చట్టపరంగా పదవి నుండి తొలగించేలా చేసింది. బహుశా ఇలా జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. రంగనాథ్‌పై సుమారు 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండ‌డాన్ని గుర్తు చేసింది . ఆయన ఎప్పుడూ జైలుకు వెళ్లే పరిస్థితుల్లోనే ఉంటూ వచ్చారు. త‌క్ష‌ణమే త‌న స్థానంలో ఐజీ స్తాయి అధికారిని నియ‌మించాల‌ని ఆదేశించింది. గత విచారణ సందర్భంగా, రంగనాథ్ చట్టబద్ధంగా వ్యవహరించేలా చూడటానికి సైన్యాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ సమయంలో, ఆయన తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి జోక్యం చేసుకుని, త‌ను కోర్టు ఆదేశాలను పాటిస్తారని హామీ ఇచ్చారు.

నిరంతర నిబంధనల ఉల్లంఘన, ఇష్టానుసారంగా నియమాలను మార్చుకోవడం, పనితీరు , నిబంధనలలోని అస్పష్టతలు హైడ్రాను ఎప్పుడూ వివాదాస్పద విభాగంగానే ఉంచాయి. కోర్టు ఆదేశాల పట్ల కమిషనర్ రంగనాథ్ వ్యవహరించిన తీరు కోర్టులకు కూడా అసౌకర్యాన్ని కలిగించింది. 63 కోర్టు ధిక్కరణ కేసులే కాకుండా, హైడ్రాపై కోర్టులలో కనీసం 500-600 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వారాంతాల్లో ప్రైవేట్ ఆస్తులను, పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసి వారి జీవితాలను నాశనం చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ప్రచార ఆర్భాటాలు (PR) కొంతమేరకే పనిచేస్తాయి. మీ “అవసరాలకు” అనుగుణంగా చట్టాలను మార్చలేమనే వాస్తవాన్ని గుర్తించాలి.