నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై సీబీఐ ఛార్జిషీట్
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ యుజి 2026 పరీక్ష లీక్ అయ్యింది. దీంతో తట్టుకోలేక 21 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో గత్యంతరం లేక కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ కూటమి సర్కార్ తిరిగి నీట్ యుజి పరీక్షను తిరిగి నిర్వహించింది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం విచారణకు సీబీఐని ఆదేశించింది. ఈ సందర్బంగా విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ 20,000 పేజీలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బుధవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది.
కోర్టు ఆ ఛార్జ్‌షీట్‌ను రికార్డులోకి తీసుకుని, అనుబంధ పత్రాలను (అనెక్చర్స్) దాఖలు చేయడానికి CBIకి అదనపు సమయం మంజూరు చేసింది. విచారణ సమయంలో పరిగణనలోకి తీసుకున్న పత్రాల జాబితాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు భౌతిక సాక్ష్యాలు (material objects) ఈ ఛార్జ్‌షీట్‌లో ఉన్నాయని కోర్టు గమనించింది. ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న వాంగ్మూలాలు, ఆధారిత పత్రాల గురించి కోర్టు వివరణ కోరగా, సుమారు 20,000 పేజీలు కలిగిన ఆ అనుబంధ పత్రాలను ప్రస్తుతం స్కాన్ చేస్తున్నామని, వాటిని రికార్డులో చేర్చడానికి అదనపు సమయం కావాలని CBI కోరింది.
ఈ అభ్యర్థనను అంగీకరించిన కోర్టు, అనుబంధ పత్రాలను దాఖలు చేయడానికి CBIకి సమయం ఇచ్చింది. తదుపరి విచారణ కోసం ఈ కేసును ఆగస్టు 3కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా నీట్ ఎగ్జామ్ కు సంబంధించి పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా 25 రోజుల కు పైగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. చివరకు తలవంచిన ప్రధానమంత్రి మోదీ సంచలన ప్రకటన చేశారు. దోషులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ మేరకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయినా ఆందోళనలు ఆగడం లేదు.