మీరు గతం యువతే దేశ భవిష్యత్తు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరూ కలిసి రాచరిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రోజు రోజుకు ప్రజాస్వామ్యం కుచించుకు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఆ విషయం గుర్తిస్తే మంచిదంటూ రాహుల్ గాంధీ హితవు పలికారు. తాజాగా విద్యార్థులు న్యాయ పరమైన డిమాండ్ కోరారని, కానీ కావాలని వారిపై దాడులకు పాల్పడడం, అనవసరమైన కేసులు బనాయించడం తప్పు అన్నారు. దీనిని తమతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండిస్తున్నాయని అన్నారు ఎంపీ.
మోదీ , అమిత్ షా జెన్-జెడ్’ (Gen Z) గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఇద్దరూ బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. యువత గొంతు నొక్కే ప్రయత్నం చేయాలని అనుకోవడం భ్రమ తప్ప మరోటి కాదన్నారు రాహుల్ గాంధీ . ఆందోళనకర పరిస్థితుల్లో యువతపై లాఠీచార్జ్ చేసి వారి ఎముకలు విరగ్గొట్టారని ఆవేదన చెందారు. ఇప్పుడు వారిపై కేసులు (FIRలు) నమోదు చేస్తూ, సోషల్ మీడియా ఖాతాలను నిలిపి వేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. మీరు గతం మాత్రమేనని రాబోయే దేశ భవిష్యత్తు అంతా యువత చేతుల్లోనే ఉంటుందని ప్రకటించారు.