newsseals.com

తెలంగాణ అంటేనే తాగడం – న‌టుడు న‌రేష్

August 2, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలంగాణ పై నోరు పారేసుకున్నారు. తెలంగాణ అంటేనే తాగ‌డం అని, ఆంధ్ర అంటే విందు చేసుకోవ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ప్రతి ప్రాంతానికి దాని స్వంత సంస్కృతి ఉంటుందన్నారు.ఇడుపు కాయితం సినిమా విషయంలో జరిగిన రచ్చ నన్ను బాధించింది అని పేర్కొన్నారు న‌రేష్. తాము తీసే సినిమాలన్నీ తెలుగు సినిమాలేన‌ని చెప్పారు. విభజనలు సృష్టించడం సరికాదని స్ప‌ష్టం చేశారు.

తాను తెలంగాణలోని మారుమూల ప్రాంతాలలో పర్యటించినప్పుడు, నేను చూసిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఎవరైనా మరణించిన మూడవ రోజున జరిగే కార్యక్రమాన్ని అక్కడి ప్రజలు వివరించిన తీరు, తెలంగాణ సంస్కృతిలోని గొప్పతనాన్ని వెల్లడించిందంటూ ప్ర‌శంసించారు. ఇదిలా ఉండ‌గా తాజాగా న‌టుడు న‌రేష్ చేసిన కామెంట్స్ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. హైద‌రాబాద్ లో ఉంటూ ఇక్క‌డ ఆస్తుల‌ను పోగేసుకుని తెలంగాణ ప్రాంతం ప‌ట్ల త‌క్కువ చూపేలా జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన‌డం ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.

Related News