జక్కన్న వారణాసిలో ‘రుద్ర’గా మహేష్ బాబు
హైదరాబాద్ : రోజు రోజుకు మహేష్ బాబు నటిస్తున్న జక్కన్న దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారణాసి. ఇంకా సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల కాకుండానే కోట్ల వర్షం కురుస్తోంది సినీ నిర్మాతకు. తాజాగా వారణాసికి సంబంధించి ఫోటోలు బయటకు వదిలాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ‘వారణాసి’లో ‘రుద్ర’గా మహేష్ బాబు మరో కోణాన్ని ఆవిష్కరించారు . ‘వారణాసి’ పోస్టర్లు గమనిస్తే, ‘రుద్ర’ కేవలం ఒక ఉగ్రమైన పాత్ర మాత్రమే కాదని, మహేష్ బాబు ఇందులో కూల్ , సాహసోపేతమైన అవతారంలో కూడా కనిపిస్తారని అర్థమవుతోంది. ‘వారణాసి’ నుండి మహేష్ బాబు ఫస్ట్ లుక్ కు భారీ ఎత్తున స్పందన వస్లోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో నేడు ఆయన అభిమానులందరికీ ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడిస్తూ, ఈ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘వారణాసి’ సినిమా నుండి మహేష్ బాబు ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో ఈ పోస్ట్‌ను పంచుకుంటూ రాజమౌళి “ఉగ్రరూపం మాత్రమే అతని ఏకైక కోణం కాదు…” అని పేర్కొన్నారు. ‘రుద్ర’ కేవలం ఒక ఉగ్రమైన పాత్ర మాత్రమే కాదని, మహేష్ బాబు ఇందులో కూల్ , సాహసోపేతమైన అవతారంలో కూడా కనిపిస్తారని పోస్టర్లు సూచిస్తున్నాయి. ఈ చిత్రంలో నటుడు విభిన్న కోణాలను ప్రదర్శించబో తున్నారని ఈ ఫస్ట్ లుక్ ధృవీకరిస్తోంది. విడుదలైన చిత్రాలలో మహేష్ బాబు గరుడైన , తీవ్రమైన లుక్‌లో కనిపిస్తున్నారు, ఇది ‘వారణాసి’ చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఈ పాన్-ఇండియా చిత్రం 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది.