newsseals.com
News

కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

Posted by: VijayaBhaskar August 10, 2026
newsseals-KCR

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72 ఏళ్ల వయసులోనూ కేసీఆర్ బండరాయిలా దృఢంగా, స్థిరంగా ఉన్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడి విషయంలో కూడా ఇంతటి అసహ్యకరమైన శీర్షికను రాసే స్థాయికి మీ జర్నలిజం విలువలు ఎలా దిగజారిపోయాయి?. ఒక కుటుంబం దుఃఖంలో ఉన్నప్పుడు వారి బాధ మీకు కనిపించదు. వారికి ఇచ్చిన భరోసా కనిపించదు. అందించిన ఆర్థిక సాయం కనిపించదు.. మీ కళ్లకు కనిపించేదల్లా కేవలం ద్వేషం మాత్రమే… మీ కలం నుండి వెలువడేది విషం మాత్రమే!

కేసీఆర్ పై మీకు రాజకీయ వ్యతిరేకత ఉంటే, వార్తా కథనాల ద్వారా దాన్ని ఎదుర్కోండి. వాస్తవాలతో విమర్శించండి..అంతేగానీ, ఒక వృద్ధ నాయకుడి విషయంలో మరణాన్ని సూచించే మాటలను శీర్షికగా మార్చి, వక్రీకరించిన సంచలనం కోసం పాకులాడటం జర్నలిజం అనిపించుకోదు. ఏళ్ల తరబడి మీ “బేబీ” కేసీఆర్ పై మీరు విషం చిమ్ముతున్నా, ఆయన స్థాయి ఏమాత్రం తగ్గలేదు. కానీ మీరు రాసే ప్రతి విషపూరిత శీర్షికతో మీ జర్నలిజం విలువలే మరింత దిగజారి పోతున్నాయి. ఒక విషయం గుర్తుంచుకోండి .కేసీఆర్ చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారు. ఆయన గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . ముందుగా, మీ కలంపై పట్టుకున్న ఆ ద్వేషాన్ని వదిలించుకోండి.. మీ జర్నలిజం విలువలు ఇంకా సజీవంగా ఉన్నాయేమో ఒకసారి సరిచూసుకోండి.