యశ్ లాంటి సూపర్‌స్టార్‌ను చూడలేదు : నయనతార
చెన్నై : ఇండియన్ లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ నటి నయనతార సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కీ రోల్ పోషించింది గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ మూవీలో. బెంగలూరు వేదికగా జరిగిన చిత్రం ట్రైలర్ ఈవెంట్ లో తను ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేకించి గత కొన్నేళ్లుగా సినిమాలలో నటించినా ఎక్కడా ఆయా మూవీస్ కు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఎందుకనో ఈసారి టాక్సిక్ విషయంలో తాను పెట్టుకున్న నియమాలను పక్కన పెట్టేశారు. తన భర్త తో కలిసి బెంగళూరు ఈవెంట్ కు వచ్చారు. ఈ సందర్బంగా తన మనసులోని మాటను వ్యక్తం చేశారు నయనతార.
తను మాట్లాడుతూనే హే..రాఖీ భాయ్ అంటూ పాన్ ఇండియా సూపర్ స్టార్ యశ్ ను ఉద్దేశించి అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగి పోయింది. సాధారణంగా తాను సినిమా ఈవెంట్లకు హాజరుకానని హీరోయిన్ నయనతార తెలిపారు. అయితే ‘టాక్సిక్’ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పారు. యశ్ ఫోన్ చేయడంతోనే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చానని వెల్లడించారు. ఎంతోమంది సూపర్‌స్టార్లతో కలిసి పని చేసినప్పటికీ.. యశ్ లాంటి సూపర్‌స్టార్‌ను ఇప్పటి వరకు చూడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నయనతార. ఈ సినిమా కోసం యశ్ ఏకంగా నాలుగున్నరేళ్లు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. తాను ఇందులో భాగం కావడం పట్ల సంతోషంగా ఉందన్నారు.