newsseals.com

ఎంపీ రేణుకా చౌద‌రి వినూత్న ప్ర‌ద‌ర్శ‌న

August 10, 2026 · VijayaBhaskar

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌టంలో గుర్తింపు పొందారు. ఉన్న‌ట్టుండి సోమ‌వారం పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో అరుదైన స‌న్నివేశానికి వేదికైంది ప్రాంగ‌ణం. కళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని వినూత్నంగా నిర‌స‌న తెలియ చేస్తూ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా రేణుకా చౌద‌రి వైర‌ల్ కావ‌డం విశేషం. అంధ భ‌క్తుల‌కు క‌నువిప్పు తీసుకు వ‌చ్చేందుకే తాను ఈ ర‌కంగా వినూత్నంగా నిర‌స‌న తెలియ చేసిన‌ట్లు వెల్ల‌డించారు ఎంపీ.

ఈ సంద‌ర్బంగా రేణుకా చౌద‌రి కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీయే స‌ర్కార్ ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో గ‌త 2014 నుంచి మోదీ ప్ర‌ధాని అయ్యాక అన్ని వ్య‌వ‌స్థ‌లు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌ని, దేశంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేవ‌లం త‌మ అనుయాయుల‌కు , కార్పొరేట్ కంపెనీలు, బ‌డా బాబుల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డం త‌ప్ప చేసింది ఏమీ లేద‌న్నారు రేణుకా చౌద‌రి. ప్ర‌శ్నించే వారిపై కావాల‌ని అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ దెబ్బ‌కు, జెన్ జి యువ‌త చేసిన పోరాటాన్ని ఆమె ప్ర‌శంస‌లు కురిపించారు.

Related News