ఆపరేషన్ సక్సెస్ జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్

హైదరాబాద్ : భుజం శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ . సినిమా షూటింగ్ లో ఆయన ఇబ్బంది పడ్డారు. దీంతో భుజానికి గాయమైనట్లు గుర్తించారు. తనకు ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో భుజం గాయానికి ఆర్థ్రోస్కోపిక్ ప్రక్రియ చేయించుకున్నారు. ఆయన ఈరోజు ఆసుపత్రి నుంచి విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి ఆయన ఆరోగ్యంపై కీలక బులిటెన్ రిలీజ్ చేసింది. డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి, ఎన్.టి.ఆర్, డాక్టర్ భాస్కర్ రావు (సీఎండీ, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్), డాక్టర్ శ్రీనివాస్ రావు సురపనేని , డాక్టర్ నితిన్ బెజ్జంకి శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైందని తెలిపారు.
నటుడు బాగా కోలుకుంటున్నారని ఆసుపత్రి తెలిపింది. శస్త్రచికిత్స జరిగిన వెంటనే, విజయవంతమైన భుజం శస్త్రచికిత్స తర్వాత ప్రార్థనలు, మద్దతు అందించినందుకు RRR నటుడు తన అభిమానులకు, స్నేహితులకు , కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక ఎక్స్ పోస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఇలా రాశారు. మీ అందరి నుండి వెల్లువెత్తిన ప్రేమకు, ప్రార్థనలకు నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. శస్త్రచికిత్స విజయవంతమైంది, నేను బాగానే ఉన్నాను. కిమ్స్ (KIMS)లోని అద్భుతమైన వైద్య బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.