ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి రాజీనామా

చెన్నై : అన్నాడీఎంకే పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అప్సరా రెడ్డి. ఈ సందర్బంగా తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కు పంపించారు. ఆ లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం మనస్పర్థలతోనో, అగౌరవంతోనో తీసుకున్నది కాదని పేర్కొన్నారు. నా నమ్మకాలకు, నా ప్రజా జీవితానికి మార్గదర్శకమైన సూత్రాలకు కట్టుబడి ఉండటానికి ఇది భావోద్వేగంతో, ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు అప్పరా రెడ్డి. నా జీవితంలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని తీర్చిదిద్దిన అవకాశాలు, బాధ్యతలు, స్నేహాలు, అనుభవాలకు కృతజ్ఞతతో నేను పార్టీని వీడుతున్నాను. ఏఐఏడీఎంకేతో నా అనుబంధాన్ని, నాతో పాటు సేవ చేసే భాగ్యం పొందిన ప్రజలను నేను ఎప్పటికీ గుర్తుంచు కుంటాను అని తెలిపారు
నా రాజకీయ ప్రయాణం ఇప్పుడు వేరే మలుపు తీసుకోవచ్చు, కానీ ప్రజలకు సేవ చేయాలనే నా నిబద్ధత మారదని కుండ బద్దలు కొట్టారు అప్పరా రాణి. ప్రజలతో నిలబడటానికి, వినాల్సిన గొంతులను వినిపించడానికి, వారధులు నిర్మించడానికి, ధైర్యంతో, కరుణతో, గౌరవంతో సేవ చేయడానికి నేను అమ్మ అడుగు జాడలను అనుసరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు .ఈ రాజకీయ నిర్ణయం తర్వాత కూడా మన మధ్య ఉన్న వ్యక్తిగత ఆత్మీయత, గౌరవం కొనసాగుతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని తెలిపారు.