newsseals.com
News

విద్యుత్ సంస్థ వినూత్న ఆలోచ‌న

Posted by: VijayaBhaskar August 15, 2026
newsseals-TGSPDCL

హైద‌రాబాద్ : టీజీఎస్పీడీసీఎల్ దూకుడు పెంచింది. తాజాగా కొలువు తీరిన సీఎండీ జితేష్ పాటిల్ ఆధ్వ‌ర్యంలో సంస్థ ముందుకు వెళుతోంది. వినూత్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో బాగంగా విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం ద్వారా విద్యుత్ సరఫరాకు అంతరాయాలను నివారించడంతో పాటు, వాటి నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి టీజీఎస్పీడీసీఎల్ పైలట్ ప్రాజెక్టుగా వుడ్ చిప్ప‌ర్ మెషిన్ , బ‌యో చార్ కిన్ ను వినియోగంలోకి తీసుకు వ‌చ్చింది. వుడ్ చాప‌ర్ మిష‌న్ ద్వారా చెట్ల కొమ్మలు, కత్తిరించిన శాఖలను చిన్న ముక్కలుగా మార్చి, వాటి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు వీలు క‌లుగుతుంది.

అనంతరం ఈ chipped branches ను Bio-Char Kilnలో ప్రాసెస్ చేసి Bio-Charగా మార్చడం ద్వారా చెట్ల వ్యర్థాలను ఉపయోగకరమైన వనరుగా మలుస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌నున్నాయి. చెట్ల కొమ్మల వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణ, కాలనీలు, రహదారులు , పరిసరాల్లో పరిశుభ్రమైన వాతావరణం, చెత్తగా పేరుకు పోయే కొమ్మల పరిమాణం తగ్గింపు, బహిరంగంగా కొమ్మలను కాల్చే అవసరం తగ్గించి పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాలను విలువైన Bio-Charగా మార్చడం, గ్రీన్ అండ్ క్లీన్ ఎన్విరాన్‌మెంట్‌కు ప్రోత్సాహం క‌ల్పించ‌డం , విద్యుత్ లైన్ల చుట్టూ వృక్ష కొమ్మల నిర్వహణ మరింత శాస్త్రీయంగా, సురక్షితంగా నిర్వహించ‌డం దీని ద్వారా వీల‌వుతుంది.